తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో ధర్నాలు చేసేది దళారులే: అర్వింద్ - భీంగల్​ మండలంలో ఎంపీ అర్వింద్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో దీక్షలు చేస్తున్నది దళారులు, ద్రోహులేనని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్​ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్​లో ఎండిన వరి పంటలను ఆయన పరిశీలించారు.

MP dharmapuri arvind visited dry paddy fields babapur village at bheemgal mandal in nizamabad district
దిల్లీలో ధర్నాలు చేసేది దళారులే: అర్వింద్

By

Published : Mar 6, 2021, 5:55 PM IST

రైతుల వరి పంటలు ఎండిపోతుంటే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు రెండు లక్షల రూపాయలు కేంద్రం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్​ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్​లో ఎండిన వరి పంటలను ఆయన పరిశీలించారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో దీక్షలు చేస్తున్నది దళారులు, ద్రోహులేనని ఆయన మండిపడ్డారు. దేశ ద్రోహులే రైతులకు మేలు చేసే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలువురు యువకులను కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.

ఇదీ చూడండి:'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆలస్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details