MP Arvind sensational comments: ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్ మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఇదే విషయం సంవత్సరం కిందటే తాను పార్లమెంట్లో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని.. అందులో నిజామాబాద్ పట్టణానికి చెందిన కొందర్ని అరెస్టు చేశారని ఆయన తెలిపారు. సంవత్సరం కిందట నిజామాబాద్‌లో కొందరికి దొంగ పాస్‌పోర్టులు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు.
బోధన్ నుంచి ఒకే చిరునామాతో అనేక పాస్‌పోర్టులు ఇచ్చారని.. ఇందులో తెరాస, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం అమిత్‌షా, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్ఐఏ అధికారులు వచ్చి దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. భారత్ రాష్ట్ర సమితి పేరుతో తెరాస దేశం మ్యాప్ మార్చారని అన్నారు.
కేసీఆర్ బతికున్నంత వరకు తెరాస జాతీయపార్టీ మారదని అభిప్రాయపడ్డారు. కవితను భారత్ రాష్ట్ర సమితిలో క్రియాశీలకంగా ఉంచాలని తాను కోరుకుంటున్నాని హెద్దేవా చేశారు. మునుగోడులో తెరాస, భాజపాల మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాక్ అక్రమిత ప్రాంతంలో పాదయాత్ర చేయాలని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం 17 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇచ్చినా కేసీఆర్ ప్రారంభించలేదని ఆయన అన్నారు.
"ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్ మారింది. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. అందులో నిజామాబాద్ పట్టణానికి చెందిన కొందర్ని అరెస్టు చేశారు. సంవత్సరం కిందట నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తెరాస, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు తెరాస జాతీయపార్టీ మారదు. మునుగోడులో తెరాస, భాజపాల మధ్యనే పోటీ ఉంటుంది. రాహుల్ గాంధీ పాక్ అక్రమిత ప్రాంతంలో పాదయాత్ర చేయాలి".- అర్వింద్ ఎంపీ
'ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్ మారింది'.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్ ఇవీ చదవండి: