ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి - MP Dharmapuri Arvind criticizes Chief Minister KCR
రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4969505-thumbnail-3x2-mp.jpg)
ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 50 వేల మంది కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నియంత ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే మాజీ ఎంపీ కవితకు పట్టిన పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఫామ్‌హౌజ్‌ను వదిలి బయటకు రావాలన్నారు.
ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి