రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అర్వింద్... సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా వెల్మల్ గ్రామాన్ని సందర్శించారు.
'వెల్మల్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా...' - MP ARVINDH COMMENT ON VILLAGE DEVELOPMENT
నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామంలో ఎంపీ అర్వింద్ పర్యటించారు. దత్తాత తీసుకున్న తర్వాత తొలిసారి గ్రామాన్ని సందర్శించిన ఎంపీ... సమస్యలపై గ్రామస్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
MP ARVINDH VISITED VELMAL VILLAGE
గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామానికి కావల్సిన నిధులు, అవసరాలపై అధికారులతో సమీక్షించారు. వెల్మల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని ఎంపీ తెలిపారు.