తెరాస ప్రభుత్వానికి పేదలంటే లెక్కలేదని... కేవలం ధనవంతులకే ప్రాధాన్యం దక్కుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమదీబజార్లో ఆయన పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న పేదలను ఖాళీ చేయించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.
పేదలంటే లెక్కలేదు... ధనవంతులకే ప్రాధాన్యం: అర్వింద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమదీబజార్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న పేదలను ఖాళీ చేయించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.
పేదలంటే లెక్కలేదు... ధనవంతులకే ప్రాధాన్యం: అర్వింద్
తెరాస, ఎంఐఎం పార్టీల ముస్లిం నేతలు అనధికారికంగా భూములు కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టినా... వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వని అధికారులు పేదల విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే హైమదీబజార్లో చిరు వ్యాపారులను ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదని అర్వింద్ అన్నారు.
ఇదీ చదవండి:యాదాద్రి ప్రధాన ఆలయాలకు ప్రత్యేక శోభ