తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్వింద్ పర్యటనకు అనుమతి నిరాకరణ... రోడ్డుపై బైఠాయించి ధర్నా - ఎంపీ అర్వింద్ ధర్నా

MP Arvind dharna: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. పర్యటనను తెరాస నేతలు అడ్డుకునేందుకు సమాయత్తం అవడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై అర్వింద్​ బైఠాయించి ధర్నా చేశారు.

MP Arvind:
MP Arvind:

By

Published : Jan 25, 2022, 3:16 PM IST

MP Arvind dharna: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని నందిపేట్ మండలం నూత్ పల్లిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు సమాయత్తం అయ్యాయి. గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు అర్వింద్ పర్యటనకు అనుమతి నిరాకరించారు. తెరాస శ్రేణులు అడ్డుకునే విషయంలో పోలీస్ కమిషనర్​తో ఎంపీ అర్వింద్ మాట్లాడారు. అయినా అనుమతి లభించలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో ఎంపీ అర్వింద్ బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు.

కొవిడ్ నిబంధనలు తెరాస శ్రేణులకు వర్తించవా అంటూ పోలీసులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస అడ్డుకుంటున్నది అర్వింద్​ను కాదని.. అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. భాజపా ఎంపీలను అడ్డుకునే పోలీసులు తెరాసను ఎందుకు అడ్డుకోరని నిలదీశారు. తెరాస నేతల కార్యక్రమాలు పోలీసులకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. అర్వింద్ ధర్నా సందర్భంగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తత... రోడ్డుపై బైఠాయించి ధర్నా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details