తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వండి: ఎంపీ అర్వింద్ - armur news

సీఎం కేసీఆర్​పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధ్వజమెత్తారు. ఆర్మూర్​లో ఓ ప్రైవేట్​ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ... నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

పంటలను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్​
పంటలను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్​

By

Published : Oct 23, 2020, 4:49 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి హజరైన ఎంపీ అర్వింద్​... అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పిప్రీ శివారులోని పంటలను పరిశీలించిన ఎంపీ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై అర్వింద్​ విరుచుకుపడ్డారు.

పంటలను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్​

వరి, సోయా పంటలను వేయమన్న ముఖ్యమంత్రి ఇప్పుడు.. ఆ దిగుబడులను కొనుగోలు చేయడానికి కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. తాగిన మైకంలో సీఎం కేసీఆర్​ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. పౌల్ట్రీఫామ్ యజమానులకు ముఖ్యమంత్రి అమ్ముడు పోయాడని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు.

పంటలను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్​

ఇదీ చూడండి: వరదల ధాటికి వాహనాలు ధ్వంసం.. మరమ్మతులకు భారీగా వ్యయం..

ABOUT THE AUTHOR

...view details