mp arvind on rahul: వరంగల్‌లో రైతు డిక్లరేషన్... రియల్ ఎస్టేట్ బ్రోచర్‌లా ఉందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌కు రైతు సమస్యలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకుండా రైతుల పంటలకు మద్దతు ధర ఎలా ఇస్తారని అన్నారు. నైట్‌క్లబ్ నుంచి సభకు వచ్చిన రాహుల్... అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటానికి కాంగ్రెస్, తెదేపాలే కారణమని... కాంగ్రెస్ విధానాలతోనే పసుపు ధర పడి పోయిందని ఆరోపించారు. పసుపు బోర్డుపై రాహుల్‌కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా? అని సవాల్ చేశారు.
'' 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌కు రైతు సమస్యలు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు. పసుపు బోర్డుపై రాహుల్‌కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా?'' - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
మరోవైపు నిజామాబాద్ సీపీ క్యాంపు కార్యాలయం ముందు అర్వింద్ ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ సీపీ కార్యాలయం ముందు బైఠాయించిన ఎంపీ అర్వింద్... గ్రామాల్లో తెరాస కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు సీపీ భద్రత కల్పించడం లేదని వెల్లడించారు. సీపీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన చేస్తానని తెలిపారు.