తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ ​జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. పసుపు బోర్డు, మద్దతు ధరపై చర్చిస్తున్నారు. 5 రోజుల్లో తెస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

mp-arvind-discuss-with-farmers-about-turmeric-board-in-nizamabad-district
అయిదు రోజుల్లో పసువు బోర్డు తెస్తానని చెప్పలేదు: ఎంపీ అర్వింద్

By

Published : Jan 23, 2021, 2:05 PM IST

Updated : Jan 23, 2021, 2:19 PM IST

పసుపు బోర్డు తెస్తానని మాత్రమే బాండ్‌లో రాశానని ఎంపీ అర్వింద్ అన్నారు. 5 రోజుల్లో తెస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. పసుపు పంటకు మద్దతు ధర రూ.15వేలు ఇప్పిస్తానని చెప్పలేదని అన్నారు. నిజామాబాద్​ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు.

రైతులతో భేటీలో పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు మద్దతు ధరపై చర్చిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసమే పసుపు రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీ వివరించారు. సమస్యను దేశానికి తెలియజేసేందుకే పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు.

ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చని వారు ప్రజల మధ్యకు రారని అర్వింద్ అన్నారు. రైతుల ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలుపొందానని చెప్పారు. క్షేత్రస్థాయిలో మిగతా పార్టీల కంటే భాజపానే బలంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు తెలిపారు.

"నేను ఎంపీ అయ్యాక ఐదుగురు రైతులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. అధికారుల బృందం నిజామాబాద్ జిల్లాకు వచ్చి రైతులతో మాట్లాడింది. నా అభిప్రాయం తీసుకున్నారు. పసుపు సమస్యపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్పైస్ బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం నిజామాబాద్​లో ఏర్పాటైంది. ఇవన్నీ ఎంపీ అయ్యాక తొమ్మిది నెలల్లోనే పూర్తయ్యాయి. 30వేల టన్నుల పసుపు దిగుమతి అయ్యేది. దీనిపై నిషేధం విధించారు. అక్టోబర్ నుంచి దేశంలోకి పసుపు దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. ఆన్ లైన్ ట్రేడింగ్ నుంచి పసుపు తొలగించే చర్యలు మొదలయ్యాయి. 2021లో ఐదు నెలల కాలంలో 99వేల టన్నుల పసుపు మన దేశం నుంచి ఎగుమతి అయ్యింది. ఇందులో పది వేల టన్నులు నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు ఎగుమతి అయ్యింది. గత ఏడాది వరకు కేవలం 69వేల తన్నులు మాత్రమే ఎగుమతి అయ్యేది. అమెరికాలో కిలో సేంద్రియ పసుపు ఆరున్నర వేలు అమ్ముడవుతోంది. పసుపు పంటకు రూ.15వేల మద్దతు ధర సాధ్యమే. సేంద్రియ పసుపు సాగు చేస్తే రూ.15వేలకు మించి ధర లభిస్తుంది"

-ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

ఇదీ చదవండి:నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి

Last Updated : Jan 23, 2021, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details