నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడటానికి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా యూరియా పంపించినా దాదాపుగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇతర జిల్లాలకు తరలించారని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించినందుకే... జిల్లా రైతులకు యూరియా కొరత కలిగించి ఇతర జిల్లాలకు తరలించారని మండిపడ్డారు.
కేసీఆర్ బిడ్డను ఓడించినందుకే... - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించినందుకే... నిజామాబాద్ జిల్లాలో యూరియా అందించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
![కేసీఆర్ బిడ్డను ఓడించినందుకే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4348084national--thumbnail-3x2-df.jpg)
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్