షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం - two dead with short circuit-in-nizamabad
20:02 April 01
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌లో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇల్లు దగ్ధం కాగా... తల్లీకుమార్తె సజీవదహనమయ్యారు. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడగా.... అతనిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే...
ప్రమాద సమయంలో అనిత, కుమార్తె శ్రీనిత, కుమారుడు శ్రీనిత్తో నిద్రిస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలుడిని బయటకు పంపించిన అనిత... కుమార్తె కోసం లోపలికి వెళ్లింది. కాపాడే క్రమంలో ఇద్దరూ సజీవదహనమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.