ఏటా ఆస్తి పన్ను డిమాండు రూ.27 కోట్లు ఉండగా రూ.21 కోట్ల నుంచి రూ.24 కోట్ల వరకు వసూలవుతోంది. పాత బకాయిదారుల వివరాలు లేకపోవడం, సంవత్సరాల నుంచి పన్ను చెల్లించని వారు ఏదో ఒక కారణంతో కోర్టుకు వెళ్లడం, పన్ను ఎక్కువగా వచ్చిందని తగ్గించాలంటూ దరఖాస్తు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అధికారులు గతంలో వీరి గురించి పట్టించుకునేవారు కాదు.
వచ్చే నెల 15 వరకే...
ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బకాయిదారులు ఈనెల 1 నుంచి కేవలం 10 శాతం వడ్డీతో పన్ను చెల్లించాలని సూచించింది. ఈ మేరకు కార్పొరేషన్‌కు రోజూ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పన్ను వసూలవుతుంది. వచ్చే నెల 15 లోగా ఒకేసారి చెల్లించేవారికే ఈ అవకాశం వర్తిస్తోంది.
* భువన్ యాప్ ద్వారా ఇళ్లు, భవనాలను కొలిచి ఆస్తి పన్ను విధించారు. ఇలా చేయడంతో ఒక్కసారిగా పన్ను పెరిగిందంటూ.. సరిచేయాలని 300 మంది దరఖాస్తు చేశారు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండడంతో వాటిని సరి చేసే అవకాశం ఇక్కడి అధికారులకు లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే 90 శాతం వడ్డీ మాఫీతో దరఖాస్తులు పెట్టుకున్న వారిలో చాలా మంది బకాయిలు కట్టేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి