తెలంగాణ

telangana

ETV Bharat / state

చూస్తే గెస్ట్​హౌజ్​లా కనిపిస్తుంది.. కానీ లోపలికెళ్తే..! - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

విభిన్నమైన కట్టడం... గెస్ట్​హౌజ్‌ను తలపించేలా ఆకృతి.. చూస్తే రంగురంగుల భవనంలా కనిపిస్తుంది. కానీ అది ఒక శౌచాలయం. సాధారణంగా రహదారులపై నిర్మించే మరుగుదొడ్లలా కాకుండా.. సరికొత్తగా నిర్మించారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేకంగా రైతుల కోసం ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా నిర్మించారు.

చూస్తే గెస్ట్​హౌజ్​లా కనిపిస్తుంది.. కానీ లోపలికెళ్తే..!
చూస్తే గెస్ట్​హౌజ్​లా కనిపిస్తుంది.. కానీ లోపలికెళ్తే..!

By

Published : May 31, 2022, 5:33 AM IST

నిజామాబాద్‌లోని శ్రద్ధానంద్​గంజ్ మార్కెట్ యార్డులో నిర్మించిన శౌచాలయం అందరినీ ఆకర్షిస్తుంది. ఇది ఎప్పుడో నిర్మించినప్పటికీ.. మరమ్మతులు చేసి రంగులు వేసి భవనం మాదిరిగా తీర్చిదిద్దారు. మార్కెట్​కు వచ్చే రైతుల కోసం 1998లో సులభ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. అప్పటి నుంచి నిన్న, మెున్నటి వరకు వాటి నిర్వహణ అంతగా లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. అపరిశుభ్ర వాతారణంలో ఉన్న కారణంగా రైతులు ఇబ్బందిపడ్డారు. నెల క్రితం మరమ్మతులు చేయించి.. గెస్ట్‌హౌజ్‌లాగా మార్చడంతో అటుగా వెళ్లిన వారు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నిర్వహణ కూడా క్రమం తప్పకుండా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చూస్తే గెస్ట్​హౌజ్​లా కనిపిస్తుంది.. కానీ లోపలికెళ్తే..!

ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు నిజామాబాద్ మార్కెట్ యార్డు ప్రసిద్ధి. పసుపు, ఇతర ఉత్పత్తులను అమ్మకాల కోసం అన్నదాతలు మార్కెట్​కు తీసుకొస్తుంటారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రైతులకు.. పంటల అమ్మకం పూర్తయ్యే సరికి 2, 3 రోజుల సమయం పడుతుంది. దీంతో వీరి కోసం మార్కెట్​లో నిర్మించిన శౌచాలయం సౌకర్యవంతంగా మారింది. కింది అంతస్తులో మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఉన్నాయి. పైఅంతస్తులో రైతులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. ఇందులో ఫ్యాన్‌లు, మంచినీటి వసతి, విశ్రాంతికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. రైతులతో పాటు పంట ఉత్పత్తులు తీసుకొచ్చే వాహనాల డ్రైవర్‌లు.. మార్కెట్‌లో పని చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు ఈ శౌచాలయాలను వాడుకుంటున్నారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన నిర్వహణతో శౌచాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details