నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన బోధిస్తున్న తమకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. గంటకు రూ.140 చొప్పున చెల్లింపుపై తాము మోడల్ స్కూల్‌లో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు నుంచి తమకు వేతనాలు లేవని వాపోయారు.
బాల్కొండలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల ధర్నా
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆదర్శ పాఠశాల ముందు ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. గంటకు రూ.140 చొప్పున చెల్లింపుపై పనిచేసే తమకు ఏడు నెలలుగా వేతనాలు లేవని వాపోయారు. పాఠశాలకు వచ్చి వెళ్లేందుకూ కష్టమవుతుందని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
బాల్కొండలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల ధర్నా
వేతనాలు అందక తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వచ్చి వెళ్లడానికి రవాణా ఛార్జీలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తమకు రావల్సిన ఏడు నెలల బకాయిలు చెల్లించాలన్నారు.
ఇదీ చూడండి:జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి