తెరాస ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాళేశ్వరం కింద నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన పనులు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. జిల్లాలోని మెంట్రాజ్‌పల్లిలో జరుగుతున్న కాళేశ్వరం 21వ ప్యాకేజీ పంప్‌హౌజ్ పనులను ఆమె పరిశీలించారు.
MLC Kavitha: మంచిప్ప జలాశయం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు: కవిత - ప్యాకేజీ పంప్ హౌజ్‌ను పరిశీలించిన కవిత
నిజామాబాద్ జిల్లాలోని కాళేశ్వరం 21వ ప్యాకేజీ పంప్ హౌజ్ పనులను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న పనులు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని ఆమె అన్నారు. మంచిప్ప జలాశయం కింద రైతులకు పైప్ లైన్ల ద్వారా నీరందించేందుకు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
ఎమ్మెల్సీ కవిత
కాళేశ్వరం 21 ప్యాకేజిలో మంచిప్ప జలాశయం కింద రైతులు భూములు కోల్పోకుండా... పైప్ లైన్ల ద్వారా నీరు అందించే పనులు చేపట్టామని కవిత చెప్పారు. ప్యాకేజీ 21తో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నామన్నారు. అంతకుముందు ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన తెరాస నేతలను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.