తెరాస ప్రభుత్వంలోనే పట్టణాల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ పార్క్‌ని ఆమె సందర్శించారు. పార్క్‌లో సుందరీకరణ పనుల నిర్వాహణపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
Mlc Kavitha: 'తెరాసతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి' - నిజామాబాద్ ఫులాంగ్ పార్క్
ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ పార్క్‌ని సందర్శించారు. పార్క్‌లో జరుగుతోన్న సుందరీకరణ పనులను ఆమె పరిశీలించారు. పనుల నిర్వహణపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
mlc kavitha
సీఎం కేసీఆర్ చొరవతో నగరాల్లో.. రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు కవిత. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పటేల్, తదితరులు పాల్గొన్నారు.