కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే విజయవంతమైందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు తగ్గిపోయిందని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Kavitha: 'ఇంటింటి సర్వే విజయవంతమైంది.. పాజిటివిటీ రేటు తగ్గింది' - లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత.. నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
mlc kavitha visited ch konduru temple
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత.. నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడో దశ కరోనాను కూడా విజయవంతంగా కట్టడి చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లోని నవసిద్దుల గుట్టను ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నామని కవిత తెలిపారు.