MLC Kavitha On Telangana Jobs 2023 : రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని.. వారి మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఉందన్న కాంగ్రెస్, బీజేపీలు.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
MLC Kavitha Comments BJP and Congress :మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఐదేళ్లలో కేవలం 21 ఉద్యోగాలు(Telangana Jobs Notification 2023) మాత్రమే ఇచ్చాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదే తెలంగాణలో పదేళ్లలో 2.30 లక్షలఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. అదే ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. మళ్లీ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.
కవితను ఓడించారని నిజామాబాద్ జిల్లా ప్రజలపై కేసీఆర్ పగబట్టారు: రేవంత్రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టలను నిర్మించి జవహర్లాల్ నెహ్రూ వాటిని ఆధునిక దేవాలయాలు అని అన్నారని గుర్తు చేశారు. కానీ ఎందుకు తెలంగాణలో ప్రాజెక్టులు(Telangana Projects) కట్టడానికి కాంగ్రెస్ నేతలకు మనసు ఒప్పుకోలేదని విమర్శించారు. గతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని.. కానీ ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరైడ్ సమస్య(Fluoride) లేదని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందిస్తున్నామని అన్నారు.