తెలంగాణ

telangana

ETV Bharat / state

Kavitha On Farmer Day Celebration : 'సైనికుల్లా.. రైతులు కూడా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు' - కవిత

Telangana Decade Day Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన.. రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రైతులకు నకిలీ విత్త నాలు అంటగట్టే వారిపై పీడీ యాక్టు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ వచ్చాక రైతుల సమస్యలన్నీ తీరిపోయాయని అన్నారు. నకిలీ విత్తనాలు లేవని, విద్యుత్ కోతలు, ఎరువులు, విత్తనాల కొరత లేవని ఆమె వివరించారు.

Kavitha
Kavitha

By

Published : Jun 3, 2023, 8:25 PM IST

MLC Kavitha On Farmer Day Celebration : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు నకిలీ విత్త నాలు అంటగట్టే వారిపై పీడీ యాక్టు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక అన్నదాతల సమస్యలన్నీ తీరిపోయాయని చెప్పారు. నకిలీ విత్తనాలు లేవని, విద్యుత్ కోతలు, ఎరువులు, విత్తనాల కొరత లేవని వివరించారు.

Telangana decade celebrations : కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కవిత సదాశివనగర్ మండలం పద్మాజీవాడీ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ఆవిర్భావ సన్నివేశాలు ఒకసారి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవని.. గత ప్రభుత్వాలు అన్నదాతలను పట్టించుకోలేదని విమర్శించారు. వరిసాగులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. కర్షకుల కోసం సంఘాలు పెట్టిన ఘనత కేసీఆర్​దేనని స్పష్టం చేశారు.

Telangana Decade Celebrations : ఊరూవాడా రైతు సంబురం.. అంబరాన్నంటిన ఉత్సవం

Telangana Formation Day Celebrations 2023 : రైతులు లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలని కవిత సూచించారు. మొత్తం భారతీయ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి.. ఎందరో పోరాటాల ఫలితంగా ఈ బంగారు తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్​ 22 రోజుల పాటు ఉత్సవాలను ప్రకటించారని చెప్పారు.

"తెలంగాణ ప్రజలు సింహాల్లా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 9 ఏళ్లు నిండిన సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సైనికుల్లా.. రైతులు కూడా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వమైన రైతు అని గుర్తించి.. రూపాయి అయినా ఇచ్చారా ? మందు బస్తా కావాలంటే.. తెలంగాణ రైతులు కేంద్రాల వద్ద రెండు, మూడు రోజులు ఎదురు చూసేవారు. నకిలీ విత్తనాలు అమ్మితే అడిగే దిక్కేలేదు. ఇప్పుడు నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే.. పీడీ యాక్టులు పెడుతున్నాము. నకిలీ విత్తనాలు గురించి దేశం మొత్తంలో పీడీ యాక్ట్​ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. చెరువులు, చెక్​ డ్యాంలు అన్నింటిని బాగు చేసుకున్నాము." - కవిత, ఎమ్మెల్సీ

Telangana Farmers Day Celebration : దేశం కోసం సైనికులు ఎలాగైతే సరిహద్దుల వద్ద కాపలా కాస్తారో.. దేశం లోపల రైతులు కూడా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. తన చెమటను చిందించి.. దేశానికే అన్నంపెట్టి అందరి ఆకలి తీర్చుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాక ముందు ఎన్నో కష్టాలు పడ్డామని పేర్కొన్నారు. పురుగుల మందు తాగి అన్నదాతలు చనిపోతూ ఉంటే కళ్లల్లో కన్నీళ్లు వచ్చేవని గుర్తు చేశారు. ఈక్రమంలోనే గతం మర్చిపోతే భవిష్యత్​ ఉండదని కవిత వ్యాఖ్యానించారు.

రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత కేసీఆర్​దే

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details