తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన తెరాస పార్టీ కార్యాలయాన్ని కవిత పరిశీలించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు తమ సొంత ఇల్లులా భావించే విధంగా పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
MLC Kavitha: తెరాస.. బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించింది: కవిత - నిజామాబాద్
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశానికే తెలంగాణ దిక్సూచిలా నిలుస్తోందని తెలిపారు. నిజామాబాద్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయ పనులు పూర్తి చేసుకున్నట్టు కవిత వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికి రాష్ట్రం దిక్సూచిలా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నూడ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ నీతి కిరణ్ సహా తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి