MLC Kavitha Fires on BJP: కేంద్రంలో భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని స్పష్టంగా అర్థమైందని తెరాస నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వరి రైతులను ఆదుకోవడం కేంద్రం బాధ్యత అని... ప్రభుత్వం నుంచి ఆ మద్దతును పొందడం ప్రతీ రాష్ట్రం హక్కు అని అన్నారు. తెలంగాణ వరి రైతులను క్రూరంగా వదిలిపెట్టిన విధానం... ప్రభుత్వ మద్దతు కోరుకునే వర్గాల పట్ల కేంద్రం దృక్పథానికి నిదర్శనమని కవిత పేర్కొన్నారు.
'కేంద్రంలో భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని స్పష్టంగా అర్థమైంది' - ఎమ్మెల్సీ కవిత వార్తలు
MLC Kavitha Fires on BJP: కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని విమర్శించారు. వరి రైతులను ఆదుకోవడం కేంద్రం బాధ్యత అని... ప్రభుత్వం నుంచి ఆ మద్దతును పొందడం ప్రతీ రాష్ట్రం హక్కు అని చెప్పారు.
వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో... సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలోని వరిలో 40శాతం తెలంగాణలోని 61 లక్షల మంది రైతులు పండిస్తున్నారని తెలిపారు. సుమారు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు చేసే ఛత్తీస్గఢ్లో తెలంగాణను పోల్చేందుకు భాజపా, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇది యాపిల్, నారింజలను పోల్చినట్లుగా వారి అజ్ఞానాన్ని బయటపెట్టిందని కవిత ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్