MLC Kavitha Chit Chat With Media : తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనని.. వంద సీట్లతో హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో మీడియాతో జరిగిన చిట్‌చాట్(MLC Kavitha Chit Chat)లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే సీఎం కేసీఆర్(CM KCR) పథకాల సృష్టికర్త అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీల మేనిఫెస్టోని కాపీ చేయాల్సిన అవసరం లేదని.. తమ పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు కేటీఆర్‌పై పోటీ చేయాలని చూస్తున్నారని.. ఈసారి కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి అసలు అవకాశమే లేదని.. ఆ పార్టీకి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేనని కవిత అన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను పోగొట్టుకుందన్నారు.
MLC Kavitha Respond on Revanth Reddy Tweet : శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
MLC Kavitha Sensational Comments on BJP and Congress : కోరుట్లలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీలకే గ్యారంటీ లేదు.. అలాంటిది కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శించారు. బీసీలకు గొడ్డలి పెట్టు కాంగ్రెస్ అని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మైనార్టీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికలు రాహుల్ వర్సెస్ రైతులుగా ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో రైతుబంధుపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరోసారి మండిపడ్డారు.
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, అభ్యుదయ వ్యతిరేకి అని ఎమ్మెల్సీ కవిత ఎక్స్(ట్విటర్)లో విమర్శలు చేశారు. రైతులు, దళితుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే.. వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తే కొత్త పతనాన్ని చవిచూస్తుందని హెచ్చరించారు. గత ఆరేళ్లుగా వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని తెలంగాణ చూస్తోందని చెప్పారు. వాటిలో భాగంగా రైతులకు రైతు బంధు అనే దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇప్పుడు ఆ రైతు బంధు రాకుండా ఆటంకం కలిగిస్తూ.. రైతు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోంది. ఈ విషయం నిరుత్సాహానికి గురి చేసిన.. అందులో ఆశ్చర్యం లేదని కవిత ట్వీట్ చేశారు.
Political War in Jagtial : జగిత్యాలలో రాజకీయ జగడం.. వారి మధ్యే ప్రధాన పోటీ
MLC Kavitha fires on Rahul Gandhi : తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి ఉంది ప్రేమబంధం కాదు.. నమ్మక ద్రోహ బంధం : ఎమ్మెల్సీ కవిత