కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే అవినీతి బయట పడుతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఒత్తిడి చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలతో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతోందని ధ్వజమెత్తారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పాల్గొన్నారు.
'అవినీతి వల్లే కాళేశ్వరం హోదాపై కేసీఆర్ మౌనం' - mlc jeevan reddy fires on kcr
తన అవినీతి బయట పడుతుందనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేసీఆర్ ఒత్తిడి చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతోందని మండిపడ్డారు.
'అవినీతి బైటపడుతుందనే కాళేశ్వరం హోదాపై కేసీఆర్ మౌనం'
ఇవీ చూడండి: 'తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది'