నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ కరోనా పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా రెండు, బోధన్ మున్సిపాలిటీకీ రెండు మొత్తం నాలుగు బోధన్ మున్సిపాలిటీకీ అంబులెన్సులు అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ లత చేతుల మీదుగా అంబులెన్సులను ఆయన బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యాధికారులకు అందించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పాన్ గల్లీలోని ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, పాన్‌గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై రోజుకు 50, బోధన్ జిల్లా ఆస్పత్రిలో 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆదనపు కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే షకీల్ దాతృత్వం.. బోధన్‌కు నాలుగు అంబులెన్సులు!
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఎమ్మెల్యే షకీల్ అమీర్ రెండు అంబులెన్సులు, బోధన్ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రెండు అంబులెన్సులు అందించారు. బోధన్‌లో ఇకపై విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని.. ఫలితాలు వీలైనంత త్వరగా అందిస్తామని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే షకీల్ దాతృత్వం.. బోధన్‌కు నాలుగు అంబులెన్సులు!