తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి' - nizamabad news in telugu

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కోరారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో పర్యటించిన ఎమ్మెల్యే... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మామిడిపల్లి చౌరస్తా వద్ద నిర్మించిన ట్రాఫిక్​ సిగ్నల్​ను ప్రారంభించారు.

mla jeevanreddy started development programs in armur
'పట్టణ ప్రగతిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలి'

By

Published : Jul 7, 2020, 1:56 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్ముర్​లో ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద నిర్మించిన ట్రాఫిక్ సిగ్నల్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన తడి, పొడి చెత్త వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం 24 వార్డుల్లో రూ. కోటి 19 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఎమ్మెల్యే. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్​ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

'పట్టణ ప్రగతిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలి'

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details