నిజామాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిత్యం పరిశీలించేందుకు ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగపడుతుందని... ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్తా - Nizamabad district latest news
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ప్రారంభించారు. ఆ వాహనాన్ని స్వయంగా నడుపుతూ నగరంలోని పలు కాలనీల్లో పర్యటించి... అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
వాహనాన్ని స్వయంగా నడుపుతూ నగరంలోని పలు కాలనీల్లో పర్యటించి... పనులను పరిశీలించారు. ఎలక్ట్రిక్ వాహనంలో దాదాపు 11 మంది కూర్చునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నిత్యం ఏదో ఒక కాలనీలో అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ