నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్‌లో ఉన్న అమరవీరుల పార్క్ వద్ద ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ మేయర్ నీతూ కిరణ్‌తో కలసి ఎమ్మెల్యే బిగల గణేశ్‌గుప్తా ప్రారంభించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక్ నగర్లోని వియకుల బావిని పరిశీలించారు. అదేవిధంగా నిజామాబాద్ మినీపార్క్, బొడ్డెమ్మ చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుని ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ పనుల కోసం నగరానికి వచ్చే ప్రజలకు మలమూత్ర విసర్జనకు సౌకర్యాలు లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానిని దృష్టిలో ఉంచుకునే ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద పబ్లిక్ టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.
'నిజామాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా' - నిజామాబాద్ జిల్లా తాజా వార్త
నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే బిగల గణేశ్ గుప్తా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను మేయర్ నీతూ కిరణ్‌తో కలిసి ప్రారంభించారు.
Breaking News
నిజామాబాద్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొడ్డెమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ జితేశ్‌పాటిల్, మున్సిపల్ ఇంజినీర్ ఆనంద్ సాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు