నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో గత శనివారం వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురైన మమత కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద మూడు లక్షల రూపాయలు అందజేశారు.
మమత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. రూ.3 లక్షల సాయం - mla bajireddy govardan at nyavanandi village
వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురైన మమత కుటుంబాన్ని నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు అందజేశారు. రెండు పడక గదుల ఇల్లు, రెండెకరాల భూమి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
![మమత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. రూ.3 లక్షల సాయం mla bajireddy govardan visits Mamata's family to give Rs 3 lakh assistance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9132047-172-9132047-1602390211454.jpg)
వాటిని మృతురాలి పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. రెండు పడక గదుల ఇల్లుతో పాటు అందుబాటులో ఉంటే రెండెకరాల భూమి మంజూరు చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బాధితులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. హత్యను రాజకీయం చేసేందుకు ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా పోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి:గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ రద్దు చేయాలి: గురుకుల మహిళా టీచర్లు
TAGGED:
nizamabad mla latest visit