తాను రౌడీయిజం చేస్తున్నానంటూ నిజామాబాద్ ఎంపీ అర్పింద్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాటలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
ఎంపీ అర్వింద్‌పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి - తెలంగాణ వార్తలు
తనపై నిరాధార ఆరోపణలు చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై పరువు నష్టం దావా వేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అర్వింద్ వైఖరిని తప్పు పట్టారు.
ఎంపీ అర్వింద్‌పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి
ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో గెలిచిన అర్వింద్ తన పదవీ కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం