నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. మండల కేంద్రమైన కమ్మర్‌పల్లిలో రూ.2.80కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన - నిజామాబాద్ తాజా వార్త
నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లిలో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతగా తర్వగా పూర్తి చేయాలని ఆదేశించారు.

నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన
స్థానిక నాయకులు పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ నాణ్యత ఉండేలా చేయించుకోవాలని అన్నారు. ఇండోర్ స్టేడియంతో పాటు ఇతర క్రీడలు అన్ని ఆడడానికి అనువుగా కోర్టులు నిర్మించాలని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉల్లాసంగా ఉండే విధంగా నిర్మాణ పనులు చేయాలని అన్నారు. మంత్రి బాల్కొండలో పర్యటించి ఇటీవలె మృతి చెందిన పూజారి మారుతిజోషి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన
ఇదీ చూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య
TAGGED:
నిజామాబాద్ తాజా వార్త