తెలంగాణ

telangana

ETV Bharat / state

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల - వేముల ప్రశాంత్‌రెడ్డి తాజా వార్తలు

దేశం మొత్తంలో 100 శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణానేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

minister vemula starts grain buying center
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వేముల

By

Published : Apr 17, 2020, 7:08 PM IST

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. దేశం మొత్తంలో 100 శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణానేనని తెలిపారు. రైతు నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా ఇంతకు ముందు 3500 కొనుగోలు కేంద్రాలు ఉంటే..ఇప్పుడు 6800 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.

రూ.2500 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీ కల్పిస్తూ.. మార్కెట్ ద్వారా చివరి కిలో వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని కోరారు


ఇదీ చదవండి:చౌటుప్పల్​లో 9 మందికి క్వారంటైన్ ముద్ర

ABOUT THE AUTHOR

...view details