తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్​డ్యామ్​ల నిర్మాణాలు పరిశీలిస్తూ.. వాగులు వంకలు తిరిగిన మంత్రి వేముల

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. వేల్పూర్​ మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పలు గ్రామాల్లో చెక్​డ్యామ్​లు నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. రైతులు, కార్యకర్తలతో కలిసి కాలినడకన వాగులు, వంకలు కలియ తిరిగారు.

Minister Vemula Prashanth Reddy Tour In Balkonda
చెక్​డ్యామ్​ల నిర్మాణాలు పరిశీలిస్తూ.. వాగువంకలు తిరిగిన మంత్రి వేముల

By

Published : May 23, 2020, 8:44 PM IST

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. వేల్పూర్​ మండలంలోని కొత్తపల్లిలో నిర్మించే చెక్​డ్యామ్, పచ్చల నడ్కుడ పెద్దవాగులో నిర్మించే చెక్​డ్యామ్​ల నిర్మాణ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. జానకంపేట్​ పెద్దవాగులో నాల్గున్నర కోట్లతో నిర్మించిన చెక్​డ్యామ్​ నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు.

పెద్దవాగు, కప్పలవాగు, కొత్తపల్లి, పచ్చల నడ్కుడ గ్రామాల్లో నిర్మించనున్న చెక్​డ్యామ్​ల నిర్మాణ ప్రాంతాలను కాలినడకతో వెళ్లి పరిశీలించారు. రైతులు, కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. మంత్రి వాగుబాటలో నడుస్తూ పలు చెక్​డ్యామ్​ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు.

నిజామాబాద్​ జిల్లాలో 72 కి.మీ పొడవు గల వాగులు రెండు ఉండగా.. బాల్కొండ నియోజకవర్గంలోని 42 కి.మీ పొడవున్న వాగుల వల్ల 65 గ్రామాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం అందుతుందని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి :'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'

ABOUT THE AUTHOR

...view details