తెలంగాణ

telangana

ETV Bharat / state

'మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా వాడాలి' - కరోనా వ్యాప్తి

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులు చికిత్స పొందేందుకు వీలుగా సదుపాయాలు మెరుగుపరచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

minister vemula prashanth reddy on covid cases in nizamabad district
'మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడాలి'

By

Published : Apr 4, 2021, 9:21 AM IST

నిజామాబాద్​లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కొవిడ్​ ఉద్ధృతిపై నిజామాబాద్​ కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాకేంద్రం, సరిహద్దు ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని... ఈ నేపథ్యంలో అందరూ మాస్క్​లు ధరించాలని సూచించారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యానికి అవసరమైన మందులు, వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా కేసుల గుర్తింపునకు కొత్త యూప్​

ABOUT THE AUTHOR

...view details