తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖరీఫ్​నాటికి నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధికి సాగు నీరందిస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీలోని సారంగపూర్, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి పంపు హౌస్ పనులను మంత్రి పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

kalewsaram project, telangana news
vemula prasanth reddy, Mentrajpalli pump house

By

Published : Apr 5, 2021, 5:30 PM IST

ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎత్తున ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందకపోవడం వల్ల... కాళేశ్వరం పథకం కింద పనులను ప్రారంభించామని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్యాకేజీలోని సారంగపూర్, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి పంపు హౌస్ పనులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.

ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న మంత్రి

వచ్చే ఖరీఫ్‌లో ఒక ప్యాకేజీ కింద నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధికి సాగు నీటిని అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ప్యాకేజీల ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్యాకేజీల పనులు పూర్తైతే జిల్లా పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. మంచిప్ప ప్రాజెక్టు కింద... కాలువలకు బదులు పైప్‌లైన్‌ ద్వారా సాగునీటిని అందించే ప్రాజెక్టును జిల్లాలో మొదటిసారిగా చేపట్టినట్లు తెలిపారు.

'ఖరీఫ్​నాటికి నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధికి సాగు నీరందిస్తాం'

జిల్లాలోని బినోల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ నుంచి ఈ ప్యాకేజీకి మళ్లిస్తున్నామన్నారు. సారంగపూర్‌ వద్ద పంప్‌హౌజ్‌లను ఏర్పాటు చేసి నిజాంసాగర్‌ కాలువలో నీటిని విడుదల చేస్తామన్నారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి వద్ద మోటార్లను ఏర్పాటు చేసి పైలట్‌ ప్రాజెక్టు పైప్‌లైన్‌ల ద్వారా నీటిని మళ్లిస్తామని మంత్రి అన్నారు. సారంగపూర్‌ నుంచే మరో ప్యాకేజీ ద్వారా మంచిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్తామన్నారు.

ఇదీ చూడండి:'ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు'

ABOUT THE AUTHOR

...view details