'స్పైస్ బోర్డు కాదు... పసుపు బోర్డు కావాలి' - TRS latest news
రాష్ట్రానికి పసుపుబోర్డు కావాలని.. స్పైస్‌బోర్డు రీజినల్ ఆఫీసు కాదని.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఉన్న స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీసును నిజామాబాద్‌లో తెరిచినంత మాత్రాన రైతులకు ఒరిగిందేమి లేదన్నారు.
Minister Vemula Prashanth REDDY Fire On Central Government
పసుపుబోర్డు పేరుతో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే స్పైస్ బోర్డు ఆఫీసు వరంగల్‌లో ఉందని.. నిజామాబాద్‌లో పెడితే రైతులకు ఏం ఉపయోగమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్, ఎరువులు, విత్తనాల సరఫరాతో రైతులకు సేవ చేస్తోందని, కేంద్రం మాత్రం మాయమాటలతో మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. ఇకనైనా మాయమాటలు కట్టిపెట్టి కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.