నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు, వైద్య సిబ్బంది, మీడియా వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
'వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాను' - minister prashanth reddy visit to balkonda
కరోనా వ్యాప్తి నివారణకు వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా,అంగన్వాడీ, ఆశా టీచర్లు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వారికి సహకరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
బాల్కొండలో నిత్యావసర సరుకుల పంపిణీ
శక్తివంచన లేకుండా నిరంతరం పనిచేస్తోన్న వారికి ఏదో విధంగా సాాయం చేయాలని తాను అనుకున్నానని, బిల్డర్ అసోసియేషన్ తెలంగాణ శాఖ సాాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా నిత్యావసరాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆరువందల మంది క్రిస్టియన్ పాస్టర్లకు సినీ నిర్మాత దిల్రాజు సాాయంతో 25 కిలోల బియ్యాన్ని మంత్రి వేముల అందజేశారు.