కశ్మీర్లో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన మహేష్ కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మహేష్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, చిత్రపటానికి నివాళులర్పించారు. మహేష్ మృతి చాలా బాధాకరమని, యుక్త వయసులోనే కోమన్‌పల్లి బిడ్డ దేశం కోసం త్యాగం చేశాడని కొనియాడారు. మహేష్‌ను కన్న తల్లిదండ్రులు, ఈ నేల ధన్యమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
జవాన్ మహేష్ కుటుంబానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శ - మహేష్ మృతి పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతాపం
జవాన్ మహేష్ మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని... ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీ సభ్యులకు సూచించారు.
జవాన్ మహేష్ కుటుంబానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శ
కశ్మీర్ సరిహద్దుల్లో శత్రువుల దాడి నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తనను తాను అర్పించుకున్నాడని... మహేష్‌కు యావత్ తెలంగాణ సమాజం అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తోందని మంత్రి అన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి, అంత్యక్రియల ఖర్చులు తానే భరిస్తానని... ఏర్పాట్లు చేయాలని గ్రామ కమిటీ సభ్యులకు సూచించి కొంత నగదు అందించారు. మంత్రి వెంట కలెక్టర్ నారాయణ రెడ్డి, అధికారులు, నాయుకులు ఉన్నారు.
ఇదీ చూడండి:చిన్ననాటి నుంచే మహేశ్‌కు దేశ సేవపై ఆసక్తి... సేవలు చిరస్మరణీయం