తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరేళ్లలో ఊహించని అభివృద్ధి: మంత్రి వేముల - నిజామాబాద్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారు

ఎన్నో పోరాటాల ఫలితం బంగారు తెలంగాణ సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

minister vemula prashanth reddy celebrated telangana formation day celebrations in nizamabad
'చిరకాల వాంఛ నెరవేరిన వేళ.. తెరాస​ ప్రభుత్వం వచ్చిన వేళ'

By

Published : Jun 2, 2020, 2:03 PM IST

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన వేళ... గత ఆరేళ్లుగా రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తాదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

'చిరకాల వాంఛ నెరవేరిన వేళ.. తెరాస​ ప్రభుత్వం వచ్చిన వేళ'

ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని... సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని మంత్రి పేర్కొన్నారు. పేదల కోసం తెచ్చిన అనేక పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ మొదలు రైతు బంధు, రైతు బీమా వరకు అనేక పథకాలు దేశంలో మరే రాష్ట్రమూ అమలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు తెరాస జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసిన మంత్రి అనంతరం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:స్వరాష్ట్రంలో సిక్సర్ కొట్టిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details