నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామపంచాయతీలో తడి పొడి చెత్తను సేకరించే రెండు వాహనాలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరూ... తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే.. చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.
స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదాం: మంత్రి వేముల - Minister vemula Prashant Reddy latest news
స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో తడి, పొడి చెత్తను సేకరించే రెండు వాహనాలను మంత్రి ప్రారంభించారు.
స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదాం: మంత్రి వేముల
ప్రతి గ్రామానికి చెత్త సేకరణ ట్రాక్టర్లు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులమై... స్వచ్ఛ తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు.
- ఇదీ చూడండి:బాసరలో వసంత పంచమి వేడుకలు