నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతేలో లాభసాటి వ్యవసాయంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో అతి ఎక్కువ వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మంత్రి తెలిపారు. రైతులకు మేలు చేయడానికే సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు పండిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని సూచించారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి - సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతేలో నిర్వహించిన లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్ మండలంలోని మోతే, రామన్నపేట, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, సుంకేట్, గాండ్లపేట్ తదితర గ్రామాల రైతులు ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. తీర్మాన ప్రతిని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.