తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్మాణ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు' - Vemula Prashant Reddy laid the foundation stone of the National Academy of Construction in nizamabad

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) జిల్లా నైపుణ్య కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్​లో నిర్మిస్తున్న ఈ శిక్షణ కేంద్రం ద్వారా జిల్లా యువతకు మేలు జరుగుతుందని తెలిపారు.

Minister Vemula Prashant Reddy laid the foundation stone of the National Academy of Construction (NAC) District Skills Center
'నిర్మాణ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు'

By

Published : Jan 7, 2021, 8:56 PM IST

న్యాక్ లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులో రూ. 6.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా నైపుణ్య కేంద్రానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.

ఎంతో మేలు జరుగుతుంది

ఏ పనిలోనైనా నైపుణ్యం ఉంటే వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని.. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి భవన నిర్మాణ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు న్యాక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లా యువతకు ఈ కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలిపిన మంత్రి.. గల్ఫ్ వెళ్తున్న కార్మికులకు ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ , తాపీ మేస్త్రీ వంటి పనులలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అచ్చు పులిలా ఉంది.. ఊరిని భయపెట్టిన గ్రామసింహం..!

ABOUT THE AUTHOR

...view details