రైతు వేదిక సిద్ధమైతే రైతులకు ఎంతో లాభదాయకమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ సోయా విత్తనాలు మొలకెత్త లేదని... సోయా రైతులను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. వేల్పూర్ మండలంలో వేముల సురేందర్ రెడ్డి మెమోరియల్ రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేశారు. ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోనూ రైతు వేదిక పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షాల విమర్శలకు భయపడేది లేదని... రైతు క్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి - నిజామాబాద్ వార్తలు
నిజామాబాద్ జిల్లాలో సోయా రైతులను ఆదుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేశారు.
minister vemula prasanth reddy