ముఖ్యమంత్రి ఆదేశాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో తెరాస పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న పార్టీ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పట్టణ కేంద్రంలో కార్యాలయం అందుబాటులో ఉండడం వల్ల కార్యకర్తలకు, నాయకులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మంత్రి వెంట అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నూడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి - vemula prasanthreddy visited construction party office building
నిజామాబాద్ నగరంలో నిర్మిస్తున్న తెరాస కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి