Vemula Prasanth reddy review : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి డ్రైరన్‌కు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్లో కాళేశ్వరం పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన 20, 21, 21ఏ ప్యాకేజీ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులు పైప్‌లైన్ పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పనుల వల్ల పంటకు ఇబ్బంది అయినా శాశ్వత సాగు నీటి సౌకర్యం కలుగుతుందన్నారు.
Vemula Prasanth reddy review : 'రెండు నెలల్లో అక్కడ మెట్ట ప్రాంతాలకు నీళ్లిస్తాం' - కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై వేముల సమీక్ష
Vemula Prasanth reddy review : రాబోయే రెండు నెలల్లో కాళేశ్వరం పనులు కొలిక్కి రావాలని అధికారులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్లో కాళేశ్వరం పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
![Vemula Prasanth reddy review : 'రెండు నెలల్లో అక్కడ మెట్ట ప్రాంతాలకు నీళ్లిస్తాం' minister vemula Prasanth reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13823313-345-13823313-1638699795431.jpg)
'నిజామాబాద్ జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులకు నీరిచ్చే వనరు శ్రీసాంగర్ ప్రాజెక్టు. వినోద దగ్గర నుంచి టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి సారంగపూర్ పంప్‌హౌస్‌కు ఎత్తిపోస్తాం. టన్నెల్ పని పూర్తయింది. సారంగపూర్ పంప్‌హౌస్‌లో కూడా పనులు పూర్తయ్యాయి. రెండు నెలల్లో వెట్‌రన్ చేస్తాం. మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు నెలలో వెట్‌రన్ చేస్తాం. అక్కడి నుంచి ఆర్మూరు, బాల్కొండ, మెట్పల్లి నియోజకవర్గాలకు నీరు వెళ్తుంది. ఆయా నియోజకవర్గాల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ కోసమే ఈ పనులు జరుగుతున్నాయి. పైపులైన్ పనులకు సహకరించండి. ఈ ఒక్క సీజన్లో కొద్ది పంట పోయినా.. శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' -వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి
ఇదీ చూడండి:Jagtial Farmers protest : ధాన్యం కొనుగోళ్లకై రోడ్డెక్కిన రైతులు