భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా నేతలు తప్పుబడుతున్నారని.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని చూపించినా.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చూపించకుంటే మీరు రాజీనామా చేస్తారా.. అంటూ సంజయ్, అర్వింద్‌లకు సవాల్ విసిరారు.
'ఆ రాష్ట్రాల్లో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని చూపించినా.. రాజీనామా చేస్తా' - నిజామాబాద్ వార్తలు
భాజపా నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తామని.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు... మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చూపినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే .. తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తిట్టడం మొదటు పెడితే.. భాజపా నేతలు గ్రామాల్లో తిరగలేరంటూ ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే.. రాష్ట్రంలోని భాజపా నేతలు మాత్రం అవివేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తామని.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చిరించారు.
ఇవీచూడండి:రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి