తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం సుభిక్షం' - నడుకుడ గ్రామంలో మంత్రి వేముల పర్యటన

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 559 ప్రకృతి వనాలు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

minister vemula prashanth reddy, nadukuda, raithuvedika and palle prakruthi vanam
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నడుకుడ, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం

By

Published : Jan 3, 2021, 2:26 PM IST

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకడ గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రకృతివనాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. అందుకోసమే స్వచ్ఛత కార్యక్రమాలతో గ్రామాలను సీఎం.. అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదని చెప్పారు.

జిల్లాలో దాదాపు 618 పల్లె ప్రకృతి వనాలు మంజూరయితే అందులో ఇప్పటికే 559 పూర్తయ్యాయని వేముల తెలిపారు. అనంతరం పచ్చల నడుకుడ, భీంగల్​లో పెద్దమ్మ, హనుమాన్ మందిరాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'

ABOUT THE AUTHOR

...view details