నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ, రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. వేల్పూర్, భీమ్‌గల్, బడా భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, పడగల్, బాల్కొండలలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో 1,656 ఇళ్లు నిర్మాణం చేపట్టగా.. అందులో 1,244 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయని చెప్పారు. ఐదు నెలల్లోగా పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. మరో 1,300 ఇళ్లు కొత్తగా మంజూరు కాగా.. వాటికి ప్థల సేకరణ కాగానే పనులు చేపడతామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.04 లక్షలు ఖర్చు చేస్తుందని చెప్పారు.