నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్‌లో లింబారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న యాపిల్ సాగును... మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రుచిలో కశ్మీర్ యాపిల్‌కు ఏ మాత్రం తీసి పోలేదని మంత్రి అన్నారు. పంట దిగుబడిని బట్టి తాను కూడా సాగు చేస్తానని వ్యాఖ్యానించారు. రైతుకు మంచి లాభాలు రావాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కశ్మీర్ యాపిల్ కంటే రుచి బాగుంది: ప్రశాంత్ రెడ్డి - వెంచిర్యాల్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన లింబారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న యాపిల్ తోటను పరిశీలించారు.
కశ్మీర్ యాపిల్ కంటే రుచి బాగుంది: ప్రశాంత్ రెడ్డి
యాపిల్ మొక్కలను హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమాన్-99 రకం తెచ్చి సాగు చేస్తున్నట్టు రైతు లింబారెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలకు పంట చేతికి వస్తుందని, ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందన్నారు. ఎలాంటి ప్రత్యేక సస్యరక్షణలు అవసరం లేకుండానే... మామూలు పద్ధతులతో సాగు చేయవచ్చని వివరించారు.
ఇదీ చూడండి:కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..