తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి'

కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడిన ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు తొలిదశలో టీకా అందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.

వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి : ప్రశాంత్​రెడ్డి
వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి : ప్రశాంత్​రెడ్డి

By

Published : Jan 12, 2021, 7:54 PM IST

ఈనెల 16న జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలో 23వేల మంది ఫ్రంట్​లైన్ వారియర్స్​కు మొదటగా టీకా ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో వాక్సినేషన్​పై సమీక్షించారు. కరోనా కాలంలో ముందుండి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్​కు మొదటి దశ టీకా అందిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో 40 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ప్రతి కేంద్రం వద్ద అంబులెన్స్, వైద్యాధికారి ఉంటారన్నారు. డివిజన్ స్థాయిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మొదటి దశలో 15వేల మంది వైద్య, ఐసీడీఎస్ సిబ్బంది, 8 వేల మంది పోలీస్, రెవెన్యూ, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా అందిస్తామన్నారు.

వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి : ప్రశాంత్​రెడ్డి

ఇదీ చదవండి:'టీకా పంపిణీలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details