నిజామాబాద్ కలెక్టరేట్లో మూడోదశ కరోనా(third wave corona) నియంత్రణ కోసం అనుసరించాల్సిన అంశాలపై జిల్లా అధికారులు, పిల్లల వైద్య నిపుణులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(vemula prashanth reddy) సమీక్ష నిర్వహించారు. మంత్రి తన నలుగురు మిత్రుల సహాయంతో ఒక కోటి రూపాయలు సమకూర్చిన చెక్కును… జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి(collector narayana reddy)కి సమావేశంలో అందించారు. జిల్లాల్లో వైద్య సదుపాయాలకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.
third wave corona: 'పిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి' - Telangana news today
నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(vemula prashanth reddy) జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి(collector narayana reddy), అధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. మూడో దశలో పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం(third wave corona) ఉన్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా, ప్రతి హాస్పిటల్లో ఐదు పడకలను ఐసీయూ బెడ్స్‌గా మార్చినట్టు తెలిపారు. మూడో దశలో పిల్లలకు కరోనా(third wave corona) వచ్చే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి… జిల్లా ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించి 6 నెలల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, జిల్లా వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Vaccination Drive:మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒకేచోట ఎంతమందికంటే..!